రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూలై 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచిన సంఘటనతో మెదక్ జిల్లా కోఆర్డినేటర్ బీరయ్య గురుకుల పాఠశాలను శనివారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల కళాశాల చుట్టు తిరిగి ముళ్లపోదలు సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చే పైపులు ఊడిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.దీంతో పైపులైన్లు చెత్త పరిసరాలు వెంటనే బాగు చేయాలని పిల్లల తల్లిదండ్రులు అధికారులను హెచ్చరించారు.వెంటనే స్పందించిన అధికారి మూడు రోజుల్లోగా హాస్టల్ కళాశాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. పాఠశాల కళాశాల విజిట్ కోసం రావడం జరిగిందన్నారు.వెంటనే పరిసరాలు శుభ్రం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై వెంటనే కాంట్రాక్టర్ ఇద్దరు అటెండర్ లను బదిలీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రలు మంది అధికారిని డిమాండ్ చేశారు.ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. హాస్టల్ విద్యార్థులతో చపాతి చేయించడం గిన్నెలు కడిగించడం కోడిగుడ్ల పుచ్చలు తీయించడం బియ్యంలో సన్న ఇసుక రావడం జరుగుతుందని దీంతో విద్యార్థులు భోజనం చేయలేకపోతున్నారని 600 మంది తల్లిదండ్రులు హాస్టల్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆరోపించారు.రీజినల్ కోఆర్డినేటర్ బీరయ్య తో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలోఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పడం మాత్రమే కానీ అక్కడ ఒక్క కెమెరా కూడా లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.హాస్టల్లో చెప్పరాని సమస్యలు ఉన్నాయని వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని అధికారి చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లిపోయారు.