రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూలై 10:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంపై గత బైపాస్ అనేక ఆర్థిక వనరులు దెబ్బతిని ఆర్థికంగా పేట వ్యాపారం వాణిజ్య వ్యాపారాలు కోల్పోయాయని మళ్లీ ఇప్పుడు ఎల్కతుర్తి బైపాస్ ను రామాయంపేట మధ్యలో నుండి తీసుకుపోవడం వల్ల మొత్తాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని స్థానిక నాయకులు వ్యాపారస్తులు రైతులు గత కొన్ని నెలలుగా ఎమ్మార్వో కలెక్టర్ కు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం కాకుండా తక్షణ చర్యలు తీసుకొని రూటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బుధవారం రోజు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానికులతో మాట్లాడడానికి రూట్ ప్రాంతాన్ని పరిశీలించడానికి ఆయన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా పరిష్కార మార్గం కనిపెట్టడం జరుగుతుందన్నారు.స్థానికుల భూ నిర్వాసికుల వ్యాపారస్తుల స్థానిక నాయకుల వినతిని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు మాట్లాడుతూ గత బైపాస్ వల్ల జరిగిన ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ రామాయంపేట పట్టణం మధ్యలో నుండి ఎల్కతుర్తి బైపాస్ రోడ్డును ఊరు బయట నుంచి రూట్ మార్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దోమకొండ యాదగిరి మోత్కు అశోక్ దోమకొండ రాములు రామాయంపేట మండల తహసిల్దార్ రజినీకుమారి మండల సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు.