రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శిశు సంక్షమ శాఖ మెదక్ వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం వారు బేటి బచావో బేటి పడావో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి మాట్లాడుతూ మెటర్నరీ బెనిఫిట్స్ గురించి మరియు పీసీపీడెన్డ్స్ యాక్ట్ గురించి ఈ చట్టం 1994 ప్రకారం చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాగే సమాజంలో భ్రూణహత్యలను ఆపడానికి అలాగే క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా డాక్టర్ సూపర్ డెంటేన్ బాల్య వివాహ నిర్మూలన, పోక్సో యాక్ట్ గురించి ఆయన చాలా చక్కగా వివరించారు. మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ నాగమణి మాట్లాడుతూ సైబర్ క్రైమ్,సఖి సర్వీసెస్, చైల్డ్ లైన్ సర్వీసెస్ ,పోక్సో ఆక్ట్ గురించి వర్క్ ప్లేస్ అరస్ మెంట్,సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలిపారు.సమాజంలో మహిళలు,బాలికలు ఎలాంటి అఘాయిత్యాలు గురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ 181,1098,100,1930 వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుపర్ డెంటెంట్,లెక్చరర్స్, డాక్టర్ హరి ప్రియ,హెల్త్ సూపర్వైజర్స్, ఏఎన్ఎం ఆశ వర్కర్లు లాప్టింగ్ మదర్స్, గర్భిణీలు డిహెచ్ఇడల్యూ స్టాఫ్ మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి, జనరల్ స్పెషల్ నాగమణి లక్ష్మణ్ పాల్గొన్నారు.