-డివైఎఫ్ఐ నూతన కమిటీ ఏర్పాటు..
స్టూడియో 10 టీవీ న్యూస్, జూలై 09, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని యువకులతో డివైఎఫ్ఐ సమావేశం నంద్యాల జిల్లా అధ్యక్షుడు మధు శేఖర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న పాల్గొని, ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 నుండి 30 వరకు జరిగే రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ తరగతులు బోధిస్తున్నారన్నారు. ఈ శిక్షణ తరగతులు మనం వినియోగించుకొని, సమాజంలో ఉపయోగపడాలని తెలిపారు. అనంతరం గాజులపల్లె డివైఎఫ్ఐ నూతన కమిటీ ఏర్పాటు చేసి, అధ్యక్షుడిగా ఇఫ్రాన్ భాష, కార్యదర్శిగా జావిద్, సభ్యులుగా ఆరు మందిని ఎన్నుకోవడం జరిగింది.