-ప్రాణాలతో బయటపడ్డ యువకుడు..
-నిర్లక్ష్య ధోరణిలో అటవీ శాఖ అధికారులు..
-భయం గుప్పిట్లో ప్రజలు..
స్టూడియో 10 టీవీ న్యూస్, జూలై 9, మహానంది:
మహానంది మండలంలోని గ్రామాల ప్రజలు గత నెల రోజులుగా చిరుత పేరు వింటే హడలిపోతున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో గాని తెల్లవారుజామున గాని చిరుత పులి ఎక్కడ దాడి చేస్తిందో అని, గ్రామస్తులు బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్న పరిస్థితి. మహానందిలోని ఈశ్వర్ నగర్ కాలనీ సమీపంలోని, చెంచు గూడానికి చెందిన నాగన్న అనే యువకుడు మంగళవారం సాయంత్రం బహర్భూమికి వెళ్ళగా, వెనుక వైపు నుంచి చిరుత పులి దాడి చేసిందని తెలిపారు. వెంటనే నాగన్న అప్రమత్తమై, భయపడి కేకలు వేయడంతో పారిపోయిందని తెలిపారు. దీంతో చెంచు గూడెంలోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు ఎవరికో ఒకరికి ప్రాణ నష్టం జరిగితే గాని స్పందించరా, అని ప్రజలు వాపోతున్నారు. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని బంధించడంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారో, అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించి, చిరుత పులిని బంధించాలని కోరుతున్నారు.