సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్ జిల్లా)
తేదీ 6-7-2024
మెదక్ జిల్లా
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి నర్సాపూర్ బస్టాండ్ లో నీరు నిలవకుండా చూడాలి
అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
ప్రతిష్టాత్మక ఉచిత బస్సుతో మహిళలకు విద్యార్థులకు ఎంతో లబ్ది
నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ని బస్టాండును ఆకస్మిక తనిఖీ
బస్సు సౌకర్యం ,జీరో టికెట్ పై ప్రయాణికులతో మాట ముచ్చట
— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నీ బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
బస్టాండ్ చుట్టూ కలియ తిరుగుతూ అన్ని రోడ్లను, భవనాలను , రికార్డులను, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నర్సాపూర్ బస్టాండ్ లో ప్రయాణికులకు అసౌకర్యాలు కల్పించవద్దని , వర్షాకాలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలని, బస్సుల వేళలో సమయపాలన పాటించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఉచిత బస్ మహిళలకు గ్రామీణ ప్రాంతం నుంచి మండల కేంద్రాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఉచిత ప్రయాణంపై మహిళలను ప్రయాణికులను తో ముచ్చటించారు.
ప్రయాణికులు జీరో చార్జి పై మహిళ సంతోషం వ్యక్తం చేశారు అని తెలిపారు. గ్రామ ,మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ఏలాంటి పర్మిషన్లు లేకుండా భవనాల నిర్మిస్తే చట్టరిత్య కఠిన చర్యలు చేపడతామన్నారు. భవన నిర్మాణాలు చేపట్టేవారు ప్రభుత్వ అనుమతితో భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి, తాహాసిల్దార్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.