సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి(మెదక్ జిల్లా).
పత్రికా ప్రకటన
తేదీ 6-7-2024
మెదక్ జిల్లా
ఫిజిక్స్ టీచర్ గా మారిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్థానిక నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల, అంగన్వాడి కేంద్రము, పల్లె ప్రకృతి వానలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .
అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లల హాజరు శాతం రికార్డులు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి మొక్కలు
నాటుతున్నారు
ఎలా సంరక్షిస్తున్నారు
ఎన్ని మొక్కలు పెంచుతున్నారు మొక్కలు బ్రతకడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
జడ్పిహెచ్ఎస్ పెద్ద చింతకుంట లో పదవ తరగతి విద్యార్థులతో ఫిజిక్స్ టీచర్ గా మారి ఫిజిక్స్ పాఠాలు బోధించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఫిజిక్స్ ను ఎలా నేర్చుకోవాలి? ఎలా ఒడిసి పట్టాలి అని మెలకువలు నేర్పిస్తూ ఫిజిక్స్ లో ఉన్న సిద్ధాంతాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధిస్తూనే సమాధానాలు రాబట్టారు. విద్యార్థులను చెప్పలేని సమాధానాలను స్వయంగా విద్యార్థులకు బోధించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న పాఠశాలలో బదిలీల అనంతరం సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో పది శాతం జీపీఏ అందరూ సాధించాలని అన్నారు.
పాఠశాలలో చెట్ల యొక్క పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులను అభినందించారు.
పాఠశాలలో 300 మొక్కలను పెంచడం గొప్ప విషయం అన్నారు. రానున్న కొద్ది రోజుల్లో
“గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్” అనే వినూత్న కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని” గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్” కోసం జిల్లాస్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి కి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.