రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 6:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో బిందెలతో నీరు పోసి బిల్లా అభిషేకం నిర్వహించారు.ప్రతి ఇంటి నుండి గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం హనుమంతుడు, శివుడిపై నీరు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వరి నాటు వేసే సమయం ఏర్పడినప్పటికీ వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.దేవుడి దయవల్ల ఇప్పటికైనా వర్షాలు కురుస్తాయని పాడిపంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్. గ్రామ పెద్దలు బిల్లం శ్యామ్ రెడ్డి. కొప్పుల వెంకట రాజం. కొత్త రాజేందర్ గుప్త . చాకలి శ్యాములు. గొల్ల శ్రీశైలం. బెల్లం మహేందర్ రెడ్డి. కంది మల్లారెడ్డి. శ్రీశైలం రెడ్డి. కుమార్. నాగరాజు. గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.