సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్ జిల్లా)
తేదీ 6-7-2024
మెదక్ జిల్లా
జూనోసిస్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజలకు జంతువుల నుండి సంక్రమించే జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పెంపుడు జంతువులకు యాంటి రాబిట్ వాక్సిన్ వేయలని, జులై ఆరో తేదీని జూలోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమంను నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పశు వైద్యశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
ప్రభుత్వ వెటర్నరీ దావకానాల్లో పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయాలన్నారు.
జూనోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతిసంవత్సరం ఈ రోజును గుర్తుచేసుకుంటున్నమని,
మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయని ,ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ వ్యాధులు అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.