సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి(మెదక్ జిల్లా)
తేదీ.29.6.2024
మెదక్ జిల్లా
*పెండింగ్ ధరణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి.
అధికారులు సమయపాలన పాటించాలి.
నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ.
అధికారుల సమయపాలన పాటించాలని , పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ , రికార్డుల పరిశీలన పూర్తవుతున్న నేపథ్యంలో సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ డిస్పోస్ చేయాలని అన్నారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్ , మ్యూటేషన్, మొదలగు వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు. పలు రికార్డును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.