సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
తేదీ 6-7-2024
మెదక్ జిల్లా
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
కూచన్ పల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ
మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలి, నీరు నిల్వ ఉండకుండా చూడాలి
పిచ్చి మొక్కలు తొలగించాలి, పాడుబడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలి
అంగన్వాడీలలో విద్యార్థులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలి
—-జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
హవేలీ ఘనపూర్ మండలంలోని కూచన్ పల్లి గ్రామాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగాతనిఖీ చేశారు.
గ్రామంలో వాడలను ,అంగన్వాడీ కేంద్రాలను, మురికి కాలువలు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సిసి రోడ్లను మురికి కాలువను పరిశుభ్రంగా ఉంచాలని , నీరు నిల్వకుండా ఉండాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, అంగన్వాడీలో పిల్లలకు, బాలింతలకు పౌష్టికరమైన ఆహారాన్నిఅందించాలన్నారు.
మలేరియా, డెంగీ ,టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు.
వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.