రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం తదితర మండలాలు నుండి వికలాంగులు తరలివచ్చి మెదక్ కలెక్టరేట్ ముందు శుక్రవారం రోజు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వికలాంగుల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుమార్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని ఆయన అన్నారు.ఇకనైనా ప్రభుత్వం దృష్టి వికలాంగులపై నిలపాలని వారి సమస్యలను వారి ఇబ్బందులను పట్టించుకోవాలని ఆయన పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు వికలాంగులకు 6000 పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగిందన్నారు.అలాగే వికలాంగుల సమస్యలు పింఛన్ విషయంలో తాము కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గౌతం మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో 6 వేల రూపాయలు ఎన్నికలలో మాట ఇచ్చినందుకు మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గౌతం వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులు పాల్గొన్నారు.