బిఆర్ఎస్ బిజెపి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 5:- బిఆర్ఎస్ బిజెపి మాటలకు ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి హరీష్ రావు ఖబర్దార్ అంటూ రాష్ట్ర టీపిపీసీ అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ అన్నారు.ఆయన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు అంతకు ముందు 1200 మంది ప్రాణాలు తీసుకోవడానికి మోసకారి మాటలు చెప్పిన ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటూ ఉండగా రుణమాఫీ కాదంటూ మోసకారి మాటలు చెప్పడంతో రైతులు ఆత్మహత్యకు అతడే కారణం అంటూ ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలంటూ ఆయన హితవు చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకు అన్ని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగస్టు 15 లోపే రైతులకు రుణమాఫీ తప్పక చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పిన హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విప్లవ కుమార్, జహీరుద్దీన్, బైరం కుమార్,బాబు, సిద్ధ రాములు భాస్కర్,హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!