సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ ముందంజు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో మూడు ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాలు
రాష్ట్రములో .57 మంది రెడ్ క్రాస్ సభ్యులు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా రిటైర్డ్ (ఐఏఎస్ అధికారి).
బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్,అజయ్ మిశ్రా, సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో సమావేశం అయ్యారు
రెడ్ క్రాస్ కార్యకలాపాలపై ,రెడ్ క్రాస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ తో చర్చించారు .
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ
రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా మాట్లాడుతూ
సేవా కార్య క్ర మాల్లో రెడ్ క్రాస్ సంస్థ ముందు వరసలో దూసుకు పోతుందని
ప్రసుతము 57 వేల సభ్యులున్న రెడ్ క్రాస్ బీద కుటుంబాలకు ఆర్థిక సహాయము అంది స్తుందన్నారు.
జిల్లా’కమిటి తో ప్రత్యేక సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన సేవా కార్య క్ర మాల పైన విసృత చర్చ జరిపారు.
ఉచిత వైద్య సదుపాయం పై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు/ ఆసుపత్రులు, 8 రక్త నిధి కేంద్రాలు, 157 సిబ్బంది తో నడుస్తున్నాయని అన్నారు.
తల సేమియా రోగులకు ఆరోగ్యశ్రీ రెడ్ క్రాస్ ఉచిత పరీక్షలు మందులను అందజేయటమే కాక భోజన వసతి కల్పిస్తున్నామన్నారు
ప్రభుత్వ పరంగా కొంత ఆర్థిక సాయం అందుతున్నమరింతగా నిధులు సమకూరుస్తే ఆసుపత్రుల సంఖ్య పెంచి బీద రోగులకు మరింత వైద్యం ఉచితంగా అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలోజిల్లా చైర్మన్ లైన్స్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి,రాష్ట్ర మేనేజ్మెంట్ సభ్యులు సింగం శ్రీనివాస్ రావు,యాదగిరి,డిజి శ్రీనివాస్ శర్మ, కైలాసం,దామోదర్ రావు,మద్దెల సత్యనారాయణ,శేష చారి,ప్రభు రెడ్డి సుజాత, భాగ్యరేఖతదితరులు పాల్గొన్నారు.