నౌపడ గ్రామ పంచాయతీ అభివృద్ధికి చర్యలు తీసుకోండి.!
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కి వినతిపత్రం అందజేసిన తెదేపా యువ నాయకులు స్వరూప రెడ్డి
నౌపాడ గ్రామ పంచాయతీ సీతానగరం, కుర్మానాధపురం, జగన్నాథపురం,నౌపడ గ్రామాల అభివృద్ధికి శాశ్వత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు కు తేదేపా యువ నాయకులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి కోరారు. విజయవాడ కరెన్సీ నగర్ మంత్రి స్వగృహంలో పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు . నౌపడ పంచాయతీ లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛమైన వంశధార తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మార్కెట్ సముదాయం , సీసీ రోడ్లు, ప్రధాన రహదారి అభివృద్ధి, కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా గోదాములు ఏర్పాటు చేయడంతో పాటు తదితర అభివృద్ధి పనులు చేయవట్టాలని ఆయన విన్నవించారు. నౌపడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు హామీ ఇచ్చినట్లు తె