రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ ఆకస్మికంగా గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పేదలకు ప్రసూతీలు చేస్తూ జిల్లాల్లో ప్రసూతీల సంఖ్యను పెంచాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో టీబి వ్యాధిగ్రస్తులకు తేమడ పరీక్షలు చేసి మంచి వైద్యం అందించాలని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే సీజనల్ వ్యాధులు ప్రబలి జ్వరాలతో వచ్చే రోగులకు సరైన పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి వారికి వైద్యం చేయాలని తెలిపారు.మండలంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు ఆయన సూచించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న వైద్యాధికారుల పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబి వైద్య అధికారి నవీన్ మండల వైద్యాధికారిని డాక్టర్ హరిప్రియ, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.