రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్న ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి స్ధాయిలో అమలు చేయలేదు.ఇచ్చిన హామీల కోసం పేద మధ్యతరగతి ప్రజలు పెన్షన్ లు,ఇందిరమ్మ,ఇండ్ల వంటి పథకాల అమలు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ప్రజా సమస్యలు అభివృద్ధిని పట్టించుకోవాలని అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందక సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గడిచిన 10 ఏళ్లలో బిఅర్ఎస్ నాయకులు మున్సిపాలిటీలో ఏ పని కూడా చేయలేదని స్థానిక బిఅర్ఎస్ పార్టీ నాయకుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం అభివృద్ది శూన్యంగా మారిందన్నారు.మున్సిపాలిటీలో ఇంటి పన్నులు అడ్డగోలుగా పెంచటం వలన పేద, మధ్యతరగతి ప్రజలుకు ఆర్థికంగా చాలా భారం పడుతుందని తెలిపారు.గతంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటి పన్నుల నమోదులో అవకతవకలను సరి చేసి ఇంటి పన్నులు తగ్గించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు కలేక్టర్ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.