సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్.
తేది 4.7.2024
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆదర్శప్రాయుడని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ తెలిపారు.
గురువారం బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హలులో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ
కొమురయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాడిన మహనీయుడు కొమురయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మాట వినపడగానే మొట్ట మొదట గుర్తుకొచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్యనేనని ఆయన పేర్కొన్నారు. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడని, వరంగల్ జిల్లాలో సాధారణ గొర్రె కాపరుల కుటుంబంలో జన్మించిన కొమురయ్య తెలంగాణ మహోన్నత ఉద్యమానికి ఆధ్యుడయ్యాడని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణ త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోశారని వారి ఆశయాలను నేటి తరానికి స్పూర్తిదాయకమని అన్నారు.
బీసీ సంక్షేమ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.