సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి (మెదక్).
03.07.2024(బుధవారం)
ప్రాధాన్యతా రంగానికి బ్యాంకులు వచ్చే సంవత్సరం పూర్తి లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు అందించడంలో అనుకున్న లక్ష్యాలు సాధించడం అభినందనీయం కలెక్టర్
కలెక్టర్ సమావేశ హాలులో డీసీసీ/ డిఎల్ ఆర్సిజిల్లా కలెక్టర్ అధ్యక్షతన రివ్యూ సమావేశం
బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశాలు లో బ్యాంకు లింకేజీకి ఉన్న ప్రభుత్వ పథకాలపై బ్యాంకు కంట్రోలర్స్, సంబంధిత శాఖల అధికారో డిఎల్- ఆర్సి సమావేశం సమావేశం నిర్వహించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి
( 5,351 ) కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక రుణప్రణాళికను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణప్రణాళికను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా( 5,351)కోట్ల రూపాయలతో వార్షిక రుణప్రణాళిక విడుదల చేస్తూ దానిలో ప్రాధాన్యత రంగానికి అత్యధికంగా 4,550 కోట్లు మరియు అప్రాధాన్యతా రంగానికి 802 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ రంగానికి 3,166కోట్లు కేటాయించగా వ్యాపార రంగానికి 1250 కోట్లు, విద్యా రుణాలకు మరియు గృహ నిర్మాణానికి 133 కోట్లుగా ప్రణాళిక సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక రుణప్రణాళిక లో అత్యధిక భాగం ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయానికి కేటాయించడం జరిగిందని, సకాలంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలను అందించేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల నుండి బ్యాంకు రుణాల రికవరీ శాతం పెరిగితే అనుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయవచ్చని తెలిపారు. బ్యాంకులు గత సంవత్సరం టార్గెట్ లో పంట రుణాలను అందించి నిర్దేశిత లక్ష్యాoలో 76.06 %
సాధించడం జరిగింది వంద శాతం లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని
అన్నారు. ప్రభుత్వ పథకాలలో బ్యాంకు లింకేజీ ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే గ్రౌండ్ చేయాలని బ్యాంకర్స్ ని ఆదేశించారు .
అంతకుముందు లీడ్ బ్యాంకు మేనేజర్ పి నరసింహమూర్తి వివిధ బ్యాంకుల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు వాటి కనుగుణంగా సాధించిన ప్రగతి గురించి వివరించడం జరిగింది
ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, D.D.M నాబార్డ్ కృష్ణ తేజ,ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ B.పల్లవి,ఎస్బిఐ ఏ.జీఎం అరుణ్ జ్యోతి,యు బి ఐ నుంచి వీర రాఘవ,ఏపీ.జీవీబీ ఉదయ్ కిరణ్ కంట్రోలర్స్,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.