శివ ఫార్చ్యూన్స్ నేచురల్స్ పాడి – పంట వ్యవసాయ క్షేత్రం విశిష్టతలు
-డాక్టర్ ఉదయగిరి శేషఫణి..
స్టూడియో 10 టీవీ న్యూస్, జూలై 03, మహానంది:
- దేశంలోనే ప్రథమంగా పాడి – పంట అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు. పశువుల మూత్రం, కడిగిన నీరు మరియు కొంత పేడ భూగర్భ సంప్ లోనికి చేరిక. మోటర్ ద్వారా మనం సాగు చేయు 30 ఎకరముల ప్రకృతి వ్యవసాయ పొలాలకు పంపడం.2. కేవలం దేశవాళీ ఆవులైన ఒంగోలు, సహివాల్ మరియు గిర్ ఆవుల పెంపకం.3. ముర్రా బర్రెల పెంపకం.4. అత్యధిక పాలిచ్చు బర్రెల మరియు ఆవుల కొనుగోలు.5. 25 ఎకరములలో సూపర్ నేపియర్, హెర్డ్జ్ లూసర్న్ పశు గ్రాసాల పెంపకం.
- సంవత్సరానికి సరిపడ్డ జొన్న చొప్ప మరియు వరి గడ్డి నిల్వ ఉంచేందుకు అతి పెద్ద షెడ్డు.7. మొక్క జొన్నలు, తవుడు మరియు కంది పిండి తో ఆరోగ్య కరమైన దాణా స్వంతంగా తయారీ.8. పరిసరాల పరిశుభ్రత, దోమల నియంత్రణకు మెష్ ఏర్పాటు, వాక్సినేషన్, డీవార్మింగ్, కాల్షియం మరియు మినరల్స్ సప్లిమెంటేషన్.
- దేశంలోనే అతి గొప్ప ఎద్దుల మరియు దున్నల సెక్సెడ్ సెమెన్( కేవలం ఆడ దూడలు పుట్టేందుకు) వినియోగం. తద్వార మరింత గొప్ప దూడల ఉత్పత్తి .
- కేంద్రం ప్రభుత్వ ప్రతిష్టాత్మక BREED MULTIPLICATION FARM కు ఎంపిక. ప్రాజెక్ట్ విలువ 4 కోట్లు. సబ్సిడీ 2 కోట్లు. అతి గొప్ప 200 ఆవులు మరియు/ లేదా గేదెలను కొనుగోలు చేసి దేశంలోనే అతి గొప్ప దున్నల సెక్సెడ్ సెమెన్ ఉపయోగించి మరింత గొప్ప ఆరోగ్యవంతమైన ఆడ దూడలను పాడి రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యం.11. బీరు పొట్టు లాంటి ఆల్కొహాల్ కల్గిన దాణ మరియు ఆక్సిటోసిన్ హార్మోన్ వాడకం నిషేదం.12. మొత్తం 550 పశువులకు అవసరమైన 22 పెద్ద షెడ్ల నిర్మాణం. 13. పశువుల సంఖ్యా పరంగా ముఖ్యంగా నాణ్యతా పరంగా దేశం లోనే అతి గొప్ప వ్యవస్థ.14. అత్యంత ఆరోగ్యకరమైన పాలను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపకుండా, ఏమాత్రం నీరు కలుపకుండా వెంటనే ప్యాకెట్లు చేసి ఏపూట పాలను ఆ పూటే వినియోగదారుల ఇల్లకు అందించడం.
- దేశీయ ఆవు పాల నుండి సాంప్రదాయ విధానంలో ( పాలు – పెరుగు – వెన్న – నెయ్యి) నెయ్యి తయారీ.
- కేవలం మన పాలను మాత్రమే ఉపయోగించి అనేక ఉత్పత్తులను ( స్వీట్లు, బాదం పాలు, మజ్జిగ, పెరుగు, పన్నీర్ ) స్వంతంగా తయారీ మరియు మన SIVA FORTUNES NATURALS షాప్ ద్వారా విక్రయం.
- వెర్మి కంపోస్ట్ తయారీ.18. గో ప్రదక్షిణ శాల, శివ పార్వతుల మరియు శ్రీ కృష్ణ పరమాత్ముల నిత్య పూజలతో ఆధ్యాత్మికత.19. మన విశిష్టమైన పాడి-పంట అనుసంధాన వ్యవస్థ ద్వారా ఎటువంటి రసాయనాలు ( chemical fertifertilisers, chemical pesticides and ripening agents) ఉపయోగించకుండా కుజూ పటాలియా , శివన్ సాంబ లాంటి దేశవాళీ వరి , అనేక రకాల కూరగాయలు మరియు పండ్లు పండించడం.
భవిష్యత్ కార్యక్రమాలు:-
- పాడి మరియు ప్రకృతి వ్యవసాయం సంభందించిన డిప్లమా కోర్సుల ఏర్పాటు.2. గ్రామీణ ఉపాధి కల్పన.
- మన నాణ్యమైన పాలతో అత్యంత రుచికరమైన ICE CREAMS తయారీ .4. నాణ్యమైన , ఆరోగ్యకరమైన , తాజా LOW FAT MILK తయారీ.
డాక్టర్ యు. శేషఫణి ,గోపవరం గ్రామం,మహానంది మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ , సెల్ నెంబర్ 9866233022