సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
తేది – 03.07.2024.
విద్యార్థులకు సైబర్ నేరాలపై,గంజాయి, డ్రగ్స్ పై అవగాహన.
జిల్లా ఎస్.పి.డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఆదేశాల మేరకు జిల్లా పరిదిలోని మెదక్ పట్టణం లో గల శ్రీచైతన్య భారతి స్కూల్ లో సైబర్ సెక్యూరిటీ డి.ఎస్.పి శ్రీ.సుభాష్ చంద్ర భోస్ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్.ఎస్.మహేందర్ గారు ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్.ఎస్.మహేందర్ మాట్లాడుతూ… రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్‌సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో మెదక్ జిల్లా సైబర్ క్రైమ్స్ పోలీసులు సైబర్ నేరాలపై, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు పెట్టుబడుల మోసాలు, ఓటీపీ, వీడియో కాల్స్, లోన్ యాప్ లు, ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలు తదితరాల గురించి విద్యార్థులకు వివరించారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండటంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడి లో క్షణిక ఆవేశం లో మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు కానీ తర్వాత తన కుటుంబ సభ్యులు ఎంత బాధ పడేది అర్థం చేసుకోలేరు అని అన్నారు. ఎలాంటి సమస్యనైనా దైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మంచి నడవడికపైనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. చుట్టుపక్కల గాని మీ గ్రామంలో కానీ ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ సిఐ.నాగరాజు గారు, శ్రీచైతన్య భారతి స్కూల్ శ్జుబెర్ , సైబర్ క్రైమ్ సిబ్బంది షీ టీమ్ సిబ్బంది, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.