సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
Thedi- 03.07.2024 (బుధవారం)
పారదర్శక పాలనకు ముందడుగు
ఆగస్టు 15 వరకుపూర్తిస్థాయిలో ఈ ఆఫీస్ అన్ని శాఖలకు డిజిటల్ లాగిన్ పాస్ వర్డ్స్ కేటాయింపు.
ప్రతి శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ఆఫీసులో లభ్యం
ఈ ఆఫీస్ సమగ్ర నిర్వహణకు ఆయా శాఖల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ద్వారా అవగాహన
ప్రభుత్వ పథకాల సంబంధించిన ప్రతి ఫైల్ స్కాన్ చేసిఈ ఆఫీసులో భద్రం
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
ప్రతి ఫైలు ఈ ఆఫీసు ద్వారా సంబంధిత అధికారి డిజిటల్ సంతకంతో తనకు పంపించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కార్యాలయంలో
ఈ ఆఫీస్ ను ప్రారంభించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పారదర్శక పాలన దిశగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్ గా స్వీకరించడం జరగదని ఈ ఆఫీస్ ద్వారా రావాలని అన్నారు.ఈ ఆఫీసులోసంబంధిత శాఖల అధికారుల డిజిటల్ సంతకంతోపాటు జిల్లా కలెక్టర్ గారి సంతకం ఉంటుందని క్షణాల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందని,చెప్పారు.
ప్రతి శాఖకు సంబంధించిన ఫైల్స్ ఈ ఆఫీసులో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వారి వారి శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందని
ఏ అధికారి ట్రాన్స్ఫర్ అయినా కూడా
వచ్చే కొత్త అధికారికి వారి శాఖకు సంబంధించిన ఫైల్స్ ఈ ఆఫీసులో చూసుకొని పరిపాలన సులభతరం అవుతుందని చెప్పారు. ఈ ఆఫీస్ విధానంపై పలుమార్లు వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని మరల ఒకసారి అందరికీ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.రెవిన్యూ
వ్యవసాయ విభాగం,బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ సిపిఓ, సివిల్ సప్లై, ఎడ్యుకేషన్, మత్య శాఖ, ఉద్యానవన సెరికల్చర్ ,మెడికల్ మైనార్టీ, పంచాయతీరాజ్ డిఆర్డిఓ,
స్త్రీ శిశు సంక్షేమం, జిఎం ఇండస్ట్రీస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ భాగం, ఫారెస్ట్ వెటర్నరీ సంబంధించినశాఖలకు సంబంధించిన ఈ ఆఫీస్ ప్రారంభించబడిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈ డిస్టిక్ మేనేజర్
సందీప్,సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.