సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్)
తేది – 03.07.2024.
కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023 పుస్తకాల పంపిణీ.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.జిల్లా సిబ్బందికి కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023 పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ… బ్రిటిష్ కాలం నాటి ఐపిసి, సిఆర్పిసి ఐఈఏ చట్టాలను కాలానికి అనుగుణంగా మార్పుచేసి కొన్ని చట్టాలను సవరణ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించే విదంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఈ కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023 పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023. వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందని ఎస్పీ గారు వివరించారు.