రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 1:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సత్తెమ్మ, ఆమె కూతురు శ్రీలత 30 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నామని, గతంలో ఉన్న రహదారిని గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య, ఎల్లయ్య అనే వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా అక్రమ ఇంటి నిర్మాణాలు చేపట్టారని, తమకు ఇంటికి వెళ్లే దారిని ఇవ్వాలని నిరుపేద మహిళ సోమవారం రోజు కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.గతంలో ఎన్ని మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తాము ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని తిరిగి రహదారి ఇప్పించాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలియపరచారు.