మల్లె చెరువులో మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తహసిల్దార్ రజనీకుమారి
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణలో మల్లె చెరువు నుండి కొందరు అధికారుల అనుమతి తీసుకోని అర్హులైన రైతుల పొలాల్లోకి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఈ విషయంపై స్పందించిన రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి ఎఇ.కుశాల్ కుమార్ మల్లె చెరువును సోమవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ మల్లె చెరువులో ఎఫ్టిఎల్ క్రింద రైతు పొలాల్లోకి మట్టి తరలిస్తున్నామని చెబుతున్న విషయంలో ఎవరైనా అక్రమంగా మట్టిని తరలించే అనుమతి లేదని ఆమె తెలిపారు.చెరువులో మట్టి తరలించడానికి మైనింగ్ పర్మిషన్ అవసరమని ఆమె పేర్కొన్నారు.ఈ విషయంలో ఎవరైనా మట్టి తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మల్లె చెరువులో మట్టి పొలానికి ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ తీసుకొని మట్టి తీసుకెళుతున్నట్లు తెలిపారు.ఈ మట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.అదే పట్టణంలోని కస్మోను కుంట,తోడేలు కుంట కబ్జాకు గురవుతున్నాయని,ఎవరైనా కుంటలను కబ్జా చేయడం లాంటివి చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని తాము తహసిల్దార్ రజినీకుమారి కి వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.