రామాయంపేట ( స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 1:- స్వచ్ఛంద రైతులకు సన్న కారు రైతులకు పోవాల్సిన చెరువులో మట్టి మధ్య దళారులు దోచుకుంటూ అమ్ముకుంటున్నారని విషయాన్ని తెలిసి మేము మండల తహసిల్దార్ రజనీకుమారి కి వినతిపత్రం అందజేశామని సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు చిలుక స్వామి వినయ్ సాగర్ విలేకరులకు బహిరంగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నగారి చిన్న కారు రైతులకు పోవాల్సిన మల్లె చెరువులో మట్టిని మధ్య దళారులు ఏదో ఒక పేరు పెట్టి వ్యాపారంగా మారుస్తున్నారని తెలుసుకొని తాము దీన్ని బహిర్గతం చేశామన్నారు.కానీ నిజాన్ని ఓర్చుకోలేని శ్రీధర్ రెడ్డి మాత్రం తాము వ్యాపారంలో వాటా అడిగామని పదివేల రూపాయలు అడిగామని చిల్లరగా మా పేర్లు వెల్లడించడం సిగ్గుచేటు అన్నారు.ఈ రెండు ఆరోపణలపై ఏమి ఆధారాలు ఉన్నాయో తీసుకొని వచ్చి మహంకాళి అమ్మ గుడి వద్ద మంగళవారం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వారు తెలిపారు. దీనికి మేము సిద్ధంగా ఉన్నామని మాపై ఆరోపణలు చేసిన వారు కూడా సిద్ధంగా ఉండాలని దీనిపై ప్రమాణాలకు సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు.నీతి నిజాయితీ ఉంటే తడి బట్టలతో గుడి ముందు ప్రదక్షణ చేసి దీనిపై వివరణ ఇవ్వాలని వారు కోరారు.