మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్ర తై బజారు ను వేలం లో దక్కించుకున్న మైలారం రవీందర్ (ఆటో జాని) నియమాల ప్రకారం సోమవారం నాడు వసూళ్లు మొదలు పెట్టారు. మొదటి టై బజారు వసూలు ను ఆయన తన విశ్వాసం ప్రకారం ఎర్రం శ్రవణ్ కుమార్ (బాబీ సేట్) నుంచి ఐదు వందలు తీసుకుని ప్రారంభించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ బాబీ సేటు చేతుల మీదుగా వసూలు ప్రారంభోత్సవం చేస్తే వసూళ్లు బాగా జరుగుతాయని, తనకు నమ్మకం అని, ఆయన హస్త వాసీ వల్ల ఎందరో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కారని నమ్మకం ఇక్కడి ప్రజలలో ఉందని తెలిపారు. ఆ నమ్మకం తోనే తన టై బజారు వసూలు కు మొదటి రశీదు బాబీ సీట్ చేతుల మీదుగా ప్రారంభం చేసానని, తాను కూడా తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి చేందుతానని నమ్మకాన్ని వెలిబుచ్చారు.