డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు

  • మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

తేది.01.07.2024, నిజామాబాద్.

ఈ రోజు నిజామాబాద్ లో మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిఎస్ గారి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని విద్యార్థి సంఘా నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజల పక్షాన నిలబడి నాయకుడు డి ఎస్ గారని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా 2004,2009 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగిందిని డి శ్రీనివాస్ లాంటి నాయకుడిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ కి మాకు తీరని లోటును మిగిల్చింది ఆయన ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!