బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చేయండి:మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ జిల్లా :
నల్గొండ పట్టణంలో అను మతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బిఆర్ ఎస్ జిల్లా కార్యాలయంపై కలెక్టర్ చర్యలు తీసుకోవా లని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.
100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పర్మిషన్స్ లేకుండా పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెట్టే…100 కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు.
అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు మంత్రి కోమటిరెడ్డి..