సర్వసిద్ది పి.హెచ్.సి వద్ద “స్టాప్ డయేరియా” పోస్టర్ ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్
తదుపరి నిర్వహించిన అవగాహన ర్యాలీ*
అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద "స్టాప్ డయేరియా" కార్యక్రమం పోస్టర్ ను గ్రామసర్పంచ్ గణేష్ ఆవిష్కరించారు. తదుపరి అన్ని గ్రామల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. బాలాజీ ఆదేశాలు మేరకు అవగాహన సదస్సులు, ర్యాలీలు స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం తో నిర్వహించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్ వాసంతి సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ రెండు నెలలు జూలై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పయి వరకు ఈ అవగాహన కార్యక్రమం లు ప్రతి గ్రామంలో నిర్వహిస్తుంటమని ,అలాగే వర్షాలు కారణంగా అన్ని ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేసే ట్యాంక్ లను క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే వాడాలని తద్వారా సీజనల్ వ్యాదులైన డయేరియా ( అతిసారం ) , టైఫాయిడ్ ,కామెర్లు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండేందుకు దోహదపడుతుందని డాక్టర్ ఎస్.ఎస్.వి.శక్తి ప్రియ మరియు డాక్టర్. ఎన్.వాసంతి అవగాహన కల్పించారు.అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరగా కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే త్రాగలని అలాగే మా ఆరోగ్య సిబ్బంది వద్ద ఓ.అర్.ఎస్ ప్యాకెట్ లు.. జింక్ టాబ్లెట్స్ వుంటాయని వారిని సంప్రదించి తీసుకొనవచ్చునని ,అతిసారం బారిన పడిన వారికి ఇది అత్యుత్తమ చికిత్స అని , కలుషిత నీరు త్రాగటం వలన,;కలుషిత ఆహారం తినటం వలన కలిగే అతిసారం (డయేరియా) బారిన పడే ప్రమాదం వుంటుందని కావున ఈ రెండు నెలలు జూలై ,ఆగస్టు నెలల్లో అందరూ పై జ్రాగత్తలు పాటించాలని డాక్టర్ పి.ఎన్.వి. ఎస్.ప్రసాద్ అవగాహన కల్పించి తదనంతరం 1."కలుషిత నీరు త్రాగొద్దు.... అతిసారం బారిన పడద్దు" 2.బయట తిండ్లు వద్దు...ఇంట్లో తిండ్లు ముద్దు 3. ఓ .అర్.ఎస్..జింక్ ఎక్కడో...డయేరియా స్టాప్ అక్కడ. అనే నినాదాలు తో ర్యాలీ* నిర్వహించారు.వీరితో పాటు ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు, పి.హెచ్.ఎన్. ఎం.రత్న సఖి,హెల్త్ సూపర్ వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్, హెల్త్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లు జి.కొండబాబు, దాసరి రామ లక్ష్మి,,ఎల్.వీణ వాహిని , శ్రావణి ఎఫ్.డి.పి.క్లస్టర్ పర్యవేక్షకులు బి.ప్రేమ్ కుమార్,హెల్త్ సెక్రటరీ లు , గ్రామ పెద్దలు, యువకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.