సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి (మెదక్).
తేది -01.07.2024 ( సోమవారం )
పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు పై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
ప్రజావాణిలో వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజల నుండి 197దరఖాస్తుల స్వీకరణ.
పెండింగ్లో ఉన్న ప్రజావాణి సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తో కలిసి ప్రజావాణి లో వివిధ సమస్యలపై ప్రజలు అందిన దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్న ప్రజావాణి సమస్యలపై ఆరా తీశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రధాన ధ్యేయమని తమ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిశీలించడం జరుగుతుందని లేనిపక్షంలో పరిష్కారం కాని సమస్యపై లబ్ధిదారులకు అర్థమయ్యే రీతిలో అవగాహన చేయాలని అన్నారు.
ఈరోజు ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు-53, 2BHK-17, పింఛన్లు
36,ఉపాధి ఉద్యోగ అవకాశాలు-05
ఇతర సమస్యలు-96 మొత్తం- 197 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.