విధి నిర్వహణలో పోలీసుల సేవలు ఎనలేనివి
-పదవి విరమణ చేసిన ఎస్ఐకు ఘన సన్మానం..
టీ మీడియా, జూన్ 30, మహానంది:
విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసిన వారందరూ మంచి గుర్తింపు పొందుతారని, వారి సేవలు ఎనలేనివి అని నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మహానంది పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాలుగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ, ఎస్సైగా ఇటీవల పదోన్నతి పొంది, పదవి విరమణ పొందిన ఎస్సై బి. బాలచంద్రుడు దంపతులను, నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, పోలీస్ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎస్సై బాలచంద్రుడు చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ చేస్తున్న బాలచంద్రుడుకు శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు. సమాజంలో శాంతి భద్రతలను అనునిత్యం పరిరక్షిస్తున్న పోలీసుల కృషి ఎనలేనిదన్నారు.భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ గాజుల పల్లె సర్పంచ్, టిడిపి నాయకులు మధు,పోలీస్ సిబ్బంది, పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.