సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
తేది – 01.07.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలం హైదర్ గూడ గ్రామానికి చెందిన కేషమైన ఆండాలు తనకు 2003 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మహేష్ తో అందరి సమక్షంలో వివాహం జరిగిందని మాకు ఒక పాప ఒక బాబు ఉన్నారని గత 03 సంవత్సరాల నుండి నన్ను నా భర్త అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని మా పాప తన భర్త దగ్గరనే ఉన్నదని తాను తన బాబుతో తూప్రాన్ లో కిరాయికి ఉంటున్నామని మా తల్లితండ్రులు భూమి ఇస్తామని అన్నారని అయినా కానీ వినడం లేదని తనని మానసికంగా శారీరకంగా వేదిస్తూ అదనపు కట్నం తేవాలని అంటున్న నా భర్త పై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని చిన్న తూప్రాన్ సి.ఐ కు సూచనలు చేయటం జరిగింది. అలాగే శివంపేట మండలం లింగోజీగూడ గ్రామానికి చెందిన దొంతి సుజాత మా మామగారు గ్రామంలో విఆర్‌ఏ విదులు నిర్వహిస్తుండే వాడని ఆయన తర్వాత మా పెద్ద కుమారుడు విఆర్‌ఏ విదులు నిర్వహించేవాడని ప్రస్తుతము రికార్డు సహాయకునిగా పని చేస్తున్నాడని మా పాలివారు మాకు రావాల్సిన భూమి భాగం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తు పట్టా భూమి దున్నుతున్నారని కావున వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని శివంపేట ఎస్.ఐ గారికి సూచనలు చేయటం జరిగింది.