రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 30:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన మ్యాతరి లింగం అనారోగ్యంతో మరణించాడు.ఈ విషయం తెలుసుకున్న ముదిరాజ్ యూత్ నాయకులు పుట్టి సందీప్ ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి సహకరించడం మానవ ధర్మం అని ఆయన అన్నారు.ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న తనవంతు సహాయం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు చింటు తదితరులు పాల్గొన్నారు.