మలేరియా వ్యతిరేఖ మాసోత్సవాలు” కార్యక్రమం ముగింపు పురస్కరించుకొని సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో నిర్వహించిన అవగాహన సదస్సు లు, ర్యాలీ లు.. అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో గల కర్రివానిపాలెం ,ఎస్.రాయవరం గ్రామాల్లో జిల్లా మలేరియా అధికారి కె .వరహాలు దొర ఆదేశాలు మేరకు “మలేరియా వ్యతిరేఖ మాసోత్సవాలు” కార్యక్రమం ముగింపు పురస్కరించుకొని అవగాహన సదస్సులు తదుపరి ర్యాలీ లు నిర్వహించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ తెలిపారు. అందులో భాగంగా జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు సూచనలు తో కర్రివానిపాలెం,ఎస్.రాయవరం గ్రామంల్లో ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు,హెల్త్ సూపర్ వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్. పర్యవేక్షణలో ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులయిన మలేరియా , ఫైలేరియా,మెదడు వాపు, డెంగ్యూ ,చికెన్ గున్యా గురించి అవగాహన సదస్సు నిర్వహించి తదుపరి ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అలాగే ఇంట్లో నిలువ వున్న నీటి పాత్రలపై మూతలు ఉంచుకోవాలని తద్వారా కీటక జనిత వ్యాధులకు కారణమైన దోమలను లార్వా దశలోనే సులభంగా అరికట్టవచ్చునని దీని కొరకు ఫ్రై డే..డ్రై డే సందర్భంగా మనం ప్రతి శుక్రవారం , శనివారం ,అది వారం నిర్వహించే యాంటీ లార్వా ఆపరేషన్ వలన నిల్వ నీటిలో వుండే అనగా ఫ్రిజ్ వెనుక తొట్టెలో, టైర్ లు లో, రుబ్బు రోళ్లు లో , ప్లాస్టిక్ డ్రమ్ములు లో , పాడుపడిన పాత్రలు , ఎయిర్ కూలర్ లు లో, కొబ్బరి చిప్పలు లో ,సిమెంట్ గోలల్లో , డ్రింక్ సీసాలు లో , పూల కుండీలు లో లార్వాలను గుర్తించి తక్షణం వాటిని నిర్మూలించవచ్చునని తద్వారా దోమల వృద్ధి నీ లార్వా దశలోనే అరికట్టగలమని అవగాహన కల్పించారు తదుపరి అవగాహన ర్యాలీ లో 1.తరిమేద్దాం ..తరిమేద్దాం. మలేరియా ను తరిమేద్దాం.; 2.దోమ కాటు..మనకు చేటు; 3.దోమలు లేని ఇల్లు….జ్వరాలు అక్కడ నిల్ ; 4.నీటి నిల్వలు లున్న ఇల్లు ..దోమలకది పుట్టినిల్లు ; అనే నినాదాలు తో డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వీరితో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జి.కొండబాబు, దాసరి రామ లక్ష్మీ, ఎఫ్.డి.పి.క్లస్టర్ పర్యవేక్షకులు బి.ప్రేమ్ కుమార్ ,హెల్త్ సెక్రటరీ లు జి.బేబీ , పి.నూకరత్నం ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు, యువకులు ఈ మలేరియా వ్యతిరేఖ మాసోత్చవాలు ముగింపు ర్యాలీలో పాల్గొన్నారు.