రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 29:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన చేపూరి రమేష్ అను వ్యక్తికి మధ్య అదే గ్రామానికి చెందిన రాగుల అశోక్ వయస్సు (57) కు గత 8 సంవత్సరాలుగా పొలానికి దారి మరియు పొలాల గెట్టు గురించి గొడవలు జరుగుతున్నాయి.పొలం గట్టును సరి చేసే విషయంలో పెద్దల సమక్షంలో పలు మార్లు సర్ది చెప్పినారు.ప్రతి విషయంలో గొడవ అవుతుండటంతో ఎలాగైనా సమయం చూసి అశోక్ ను చంపివేయాలని చెపూరి రమేష్, అతని భార్య వెంకట లక్ష్మీ, ఇద్దరు కొడుకులు భారత్ వినయ్,తేజ ముందుగానే మాట్లాడుకొని పథకం ప్రకారమే ఈ నెల 27న ఉదయం రమేష్, అతని భార్య అతని ఇద్దరు కొడుకులు వారి పొలానికి వెళ్ళినారు.అక్కడ చూడగా పొలం గెట్టు కొంచెం చెక్కినట్టుగా ఉండగా, అశోక్ గురించి చూడగా అతని భూమిలోని పౌల్ట్రీ ఫామ్ వద్ద అశోక్ వారికి కనిపించాడు.ఆ నలుగురు అతన్ని కొట్టుకుంటూ వారి పొలంలోకి ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి వారందరూ కలసి గొడ్డలితో,కర్రతో అశోక్ ను కొట్టగా అశోక్ అక్కడికక్కడే మరణించినాడు.ఇట్టి కేసును విచారణ చేపట్టి 29న మధ్యాహ్నం ఆధ్యా ముందర రోడ్ పై వారిని అరెస్ట్ చేయటం జరిగినది.ఈ రోజు మెదక్ కోర్టు కు వారిని ప్రవేశపెట్టటం జరుగుతుందని రామాయంపేట సిఐ.వెంకట రాజాగౌడ్ తెలిపారు.ఈ కేసును త్వరగా ఛేదించిన రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ వీరన్న కానిస్టేబుల్ నాగభూషణం,సాజిద్, కుమార్, శ్రీనివాస్,హోమ్ గార్డ్ సూర్య, రవి లను సీఐ అభిందించారు.