ఎన్నికల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 29:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో దొరికిన మద్యంను మెదక్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో రామాయంపేట ఎక్సైజ్ కార్యాలయంలో సుమారుగా మూడు లక్షల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు.ఎక్సైజ్ శాఖలో జులై 1 నుండి రాష్ట్రంలో నూతన చట్టాలను, అమల్లోకి తీసుకురావడం జరుగుతుందని అందుకోసం ఆయన ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఆయన నూతన చట్టాలపై ఎక్సైజ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి, ఎక్సైజ్ ఎస్ఐ. విజయ్ సిద్ధార్థ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!