రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 29:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు పిల్లుట్ల రాములు ఆధ్వర్యంలో చలో జూలై 7న రవీంద్ర భారతిలో జరిగే మాదిగ దండోర రజతోత్సవాల కరపత్రికను మెదక్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాటింపులకు పెళ్లిళ్లకు చావులకు పరిమితమైన మాదిగ హక్కుల ఉద్యమం మొదలై 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రవీంద్ర భారతిలో మేడి పాపన్న మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు జిల్లాలోని మాదిగ ఉప కులాలు మాదిగ మేధావులు మాదిగ యువకులు మాదిగ మహిళలు మాదిగ కళాకారులు ప్రతి పల్లె నుండి మాదిగ దండోరా రజతోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బుర్ర ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర లింగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర సంజీవయ్య జిల్లా అధ్యక్షులు పిల్లుట్ల రాములు జిల్లా ఉపాధ్యక్షులు రూపుల నర్సింలు మండల అధ్యక్షులు ప్రభాకర్ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.