దున్నపోతుకు వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 29:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు డిఈఓ గారిని విన్నవించుకున్న చరవాణిల ద్వారా సమాచారం ఇచ్చిన ఎలాంటి స్పందన లేకుండా పోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం మొదలైన 20 రోజుల నుండి ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు.అలాగే ప్రైవేటు పాఠశాలలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను విక్రయిస్తున్న ఇప్పటివరకు ఒక్క యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోలేని ఈరోజు జిల్లా విద్యాధికారి బాధ్యతలో కూర్చొని విద్యారంగానికి సంబంధించిన విషయం పట్టించుకోకుండా ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముగాస్తున్నాడని పేర్కొన్నారు.
అతని యొక్క ప్రవర్తన తీరు అతని యొక్క పనితీరు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది.కాబట్టి ఏబీవీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 11 వేల పోస్టుల భర్తీకి నాంది పలికి మిగతా ఖాళీగా ఉన్న పోస్టులను మరిచిపోయి మా వల్లే ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమైందని ప్రగల్బాలు పలుకుతుందన్నారు.ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ సర్కార్ ఈరోజు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ రకంగానే పరిపాలనను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి దీనిని ఉపసంహరించుకొని డీఎస్సీ పేరుతో పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను రక్తమును జలగల్లా పీడిస్తున్న విద్యాధికారుల చీమకుట్టినట్టుగా కూడా ప్రవర్తించడం లేదు.
కాబట్టి ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల అమ్మకాన్ని ఆపివేయాలి.ప్రతి యాజమాన్యం ఫీ స్ట్రక్చర్ను మెయింటైన్ చేసే విధంగా ఆదేశాలు అందజేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శాంతియుతంగా కాకుండా ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా కార్యచరణ చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ ఏబీవీపీ నాయకులు సంపత్ నగర సంయుక్త కార్యదర్శి ప్రణయ్ భరత్ అరవింద్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.