Reporter -Silver Rajesh Medak.
తేది -27/6/2024
దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నూతన చట్టాలపై అవగాహన అవసరం కొత్త చట్టాల పై ముగిసిన శిక్షణా తరగతులు జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్
దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు అన్నారు. భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యా అధినియం-2023 పై జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా తరగతులు ఈ రోజుతో ముగిశాయి. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ అధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ హాజరై అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ… జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలు అమలులోకి వస్తున్నాయని అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో, శిక్షలలో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు ఈ కొత్త చట్టాలు వీలుగా ఉంటాయన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించి, శిక్షణా తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. శిక్షణ కాల సమయంలో సమయపాలన పాటిస్తూ అందరికీ అర్థమయ్యేలా తరగతులు బోధించిన డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీ. N.మధుసూధన్ గౌడ్ , శ్రీమతి.రేణుకా రెడ్డి అల్లాదుర్గ్ సి.ఐ, శ్రీ.కె.శ్రీనివాస్ రెడ్డి నిజాంపేట ఎస్.ఐ.శ్రీ.శంకర్ పెద్ద శంకరంపేట ఎస్.ఐ.శ్రీ.బాలరాజు చేగుంట ఎస్.ఐ. సహాయ సిబ్బంది కానిస్టేబుల్లు వై.అనిల్ కుమార్, ఐటీ సెల్ , M.A. సయీద్, ఐటీ సెల్ గార్లను జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు అభినందించారు.