రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 27:- మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ స్థలం లేక సౌకర్యాలు లేక మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి మార్చడం జరిగింది. 600కు పైగా డిగ్రీ విద్యార్థినిలు వాసవి కాలేజీ బిల్డింగ్ లో బ్రిలియంట్ ప్రైవేట్ పాఠశాలలో వాణి విద్యాలయ బిల్డింగులలో చేర్పించడం జరిగింది. కానీ వారికి సౌకర్యాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వాణి విద్యాలయంలోని విద్యార్థులకు నీటి సౌకర్యాన్ని మున్సిపల్ ఆధ్వర్యంలో అందించడం జరుగుతుందని ప్రిన్సిపల్ శిరీష తెలిపారు. వాష్రూమ్లు బాత్రూంలో కూడా 230 మందికి 27 ఏర్పరచడం జరిగిందన్నారు. పడుకోవడానికి గదులు కూడా అందరికీ సరిపోయినట్టు ఉన్నాయని ఆమె అన్నారు. అకస్మాత్తుగా మెడికల్ కాలేజీ మంజూరుకు అయిన కారణంగా పిల్లికోటల్ నుండి రామాయంపేటకు మార్చడం జరిగిందన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు వాణి విద్యాలయంలో సైన్స్ కు సంబంధించిన విద్యార్థులు వాసవి బిలియన్ భవనాల్లో ఉంటున్నారని అన్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అందరూ సహకరిస్తే కాలేజీ రామాయంపేటలోని ఉండవచ్చని ఆమె అన్నారు. విద్యార్థినులకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.