రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 27:- మెదక్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల గురువారం రోజు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతూ,, ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని మరియు ఈ పాస్ మిషన్ల ద్వారా మాత్రమే రైతులకు ఎరువుల విక్రయాలను జరపాలని తెలిపారు. డీలర్లు తప్పనిసరిగా ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం నిబంధనలు పాటించాలని ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వారికి రిపోర్టులను అందజేయాలని సూచించారు.అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని డీలర్లను ఆదేశించారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ వివరాలు సేకరించి ఈపాస్ మిషన్లో నమోదు చేయాలని, రైతులు కూడా తప్పనిసరిగా ఎరువులు కొనేటప్పుడు తమ ఆధార్ వివరాలను షాపు యజమానులకు అందజేయాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా యూరియా 444 మెట్రిక్ టన్నులు, డిఏపి 40 మెట్రిక్ టన్నులు 399 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు, 38 మెట్లు టన్నుల పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు వాటిని కొనుగోలు చేయవచ్చని తెలిపారు.