రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 27:- భూవివాదాల విషయంలో లక్ష్మాపూర్ గ్రామంలో ఒకరిని దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో చేపూరి రమేష్ అతని భార్య మరియు అతని కొడుకులు కలిసి అదే గ్రామానికి చెందిన రాగుల అశోక్ అనే వ్యక్తిని భూ వివాదాల నేపథ్యంలో గురువారం రోజు ఉదయం వారి యొక్క భూమి వద్ద గొడ్డలితో మరియు బండరాయితో బలంగా అశోక్ తలపై కొట్టి చంపినారు.మృతుడు అశోక్ యొక్క తమ్ముడు శేఖర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశాడు.ఇట్టి విషయంపై రామాయంపేట సిఐ.వెంకట రాజాగౌడ్ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగిందని రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు.