- మైనింగ్ తవ్వకాలు వద్దంటే వద్దు అని తీర్మాణించిన అంతారం గ్రామస్తులు
- ప్రజలకు, జంతువులకు పర్యావరణానానికి నష్టం కలిగించే మైనింగ్ వద్దని ప్రజాభిప్రాయం మేరకు మైనింగ్ నిలిపివేయాలి- రాష్ట్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి
చేవెళ్ల: పర్యావరణానికి, ప్రజలకు, జీవకోటికి హాని కలిగించే మైనింగ్ తవ్వకాలకు
అనుమంతులు వద్దుని గ్రామసభ ద్వారా గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మాణాన్ని పరిగణంలోకి తీసుకొని మైనింగ్ అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామంలో గురువారం ఎస్ఆర్ మినరల్స్ సంస్థ మైనింగ్ తవ్వకాలంకోసం అనుమతులు కావాలని కోరాటంతో పర్యావరణ అనుమతులకోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణ పోల్యుషన్ బోర్డు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీవాత్సవ్, పోల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, చేవెళ్ల ఆర్టీఓ సాయిరాం, తహసీల్దార్ క్రిష్ణయ్య, ఎంపీడీఓ హిమబిందు, పలు NGO లు, గ్రామస్తులు, రైతుల సమక్షంలో జరిగింది. చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామ సమీపంలో ఉన్న పంచలింగాల గుట్టపై గత కొంత కాలంగా జరుగుతున్న ఎస్ఆర్ మిరల్స్ మైనింగ్ తవ్వకాలతో ఎంతో నష్టం జరిగిందని ఇక మీదట ఇక్కడ మైనింగ్ అనుమతులు వదని గ్రామస్తులు కోరుకుంటున్నట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లో కూడా వారు ఇదే అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పటమే కాకుండా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసుకున్నట్లు తెలిపారని చెప్పేరు.
ప్రజాభిప్రాయ సేకరణ ను పొల్యూషన్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ ప్రజలకు జరుగుతున్న నష్టంపై కోర్టుకు కూడా వెళ్లనునట్లు తెలిపారు. ఎస్ఆర్ మిరల్స్ యాజమాన్యం ఇక్కడ ప్రజలు, రైతుల పై దౌర్జన్యం కూడా చేసినట్లు ప్రజలు చెబుతున్నారని వాపోయారు. గతంలో ఎలా ఈ మైనింగ్ కు అనుమతులు ఇచ్చారో తెలియదు. ప్రజలు అప్పుడు కూడా వద్దని చూపిన ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారన్నారు.