Reporter -Silver Rajesh Medak.
జూన్ 27-2024
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాసామర్ధ్యాలు మెరుగుపడాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
గురువారం చిల్పిచేడు జిల్లా పరిషత్ పాఠశాల అంగన్వాడి కేంద్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
కలెక్టర్ చిల్పిచెడు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పిల్లలు చదువులో వెనుకబడినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తించారు. వెంటనే ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ సబ్జెక్టుల వారీగా బోధన నైపుణ్యాలు మెరుగుపడాలని తద్వారా పిల్లలకు ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెప్పారు ఒక నెల గడువులోపు బోధనా విధానాల్లో మార్పు రావాలని మళ్లీ క్షేత్రస్థాయి పర్యటనలు విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసం కనపడకూడదని ఆదేశించారు.
అనంతరం చిల్పిచెడు గ్రామంలోపర్యటించి బడి బయట పిల్లలు ఎవరైనా ఉన్నారా స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి చిన్నపిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను సంబంధిత అంగన్వాడి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో మూడు సంవత్సరాలు నిండిన చిన్నపిల్లలను
అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని
అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.