రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం స్వచ్ఛందంగా బంద్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గాని పరిపాలన విధానం మారలేదని అధికారం మారింది గానీ అధికారుల తీరు మారలేదని తెలిపారు. ఎందుకంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు విద్యానిర్మానంపై ఆధారపడి ఉందన్నారు. ఇలాంటి విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా ఉందన్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా విద్యాసంస్థల చలామణి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల పుస్తకాలు విస్తరివిడిగా అమ్ముతున్నప్పటికిని ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.ఈరోజు రాష్ట్రంలో విద్యాసంస్థలన్నీ విద్య కేంద్రాలుగా ఉండవలసిన విషయం మరిచిపోయి వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి కరువైపోయాడని విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి విద్యారంగ పరిస్థితిలను వెంటనే చక్కదిద్దాలని తెలిపారు. విద్యారంగం పట్ల నిర్లక్ష్యతను నిరసనగా ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి శివ ఏబీవీపీ నాయకులు సంపత్ సాయి తదితరులు పాల్గొన్నారు.