సురేందర్ నవీపేట్ రిపోర్టర్
స్టూడియో 10టీవీ ప్రతినిధి
తేదీ -27-6-2024
చెత్తకు నిలయంగా దొడ్ల వాగు
నవీపేట్ మండల కేంద్రంలో : వాగులో చెత్త పారవేయడం పై ఇరు గ్రామ పంచాయతీల వారు పట్టించుకోకపోవడంతో.సమీపాన ఉన్న దొడ్ల వాగు చెత్తకు నిలయంగా మారింది.నందిపేట్, బాసర,కు వేలే దారి పరిధిలో ఉన్న నిర్వాహకులు తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవర్ధలను దొడ్ల వాగులో పారేస్తుండడంతో చెత్తతో నిండిపోయింది. వాగు వద్దకు రాగానే ఆ వ్యవర్ధాలతో వెలువడే దుర్గం దంతో ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే. గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ లో వేయకుండా వాగులో పారేస్తుండడంతో. డంపింగ్ యార్డ్ గా మారి చెత్త పేరుకు పోయింది. దుర్గంధంతో ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని నవీపేట్, గ్రామపంచాయతీ సెక్రటరీ, కారోబార్ పై చర్యలు తీసుకోవాలన్న గ్రామ ప్రజలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అంటున్నారు.