రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్,ఎక్సైజ్ సీఐ.రాణి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెదక్ జిల్లా పోలీసు కళాబృందం వారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో యువత బాగుపడాలంటే చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు. సమాజంలో యువత ఆరోగ్యము బాగుండాలంటే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. చిన్న వయసులో యువత గంజాయి, సిగరెట్లకు, డ్రగ్స్ కు బానిసలు కాకుండా విద్యార్థులు వారి ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదువుపై శ్రద్ధ పెట్టి సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ పోలీసు సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.