Reporter -Silver Rajesh Medak.
తేది 26.6.2024.
ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలల్లో కనీస సామర్ధ్యాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100%
నమోదు జరిగే విధంగా పగడ్బందీగా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వపాఠశాలల విద్యా విధానాలపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలల్లో కనీస సామర్ధ్యాలు పెంపొందించాలని
పాఠశాలల్లో పనిచేసే సైన్స్, మ్యాక్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు గ్రౌండ్ లెవెల్ లెర్నింగ్ పైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని
ఈ శిక్షణా కార్యక్రమాలు జులై -02 లోపల జరగాలన్నారు.
అన్ని ఆవాస ప్రాంతాల్లో పిల్లలుబడిలో చేరారు అనే విధంగా ఉపాధ్యాయులు హెడ్మాస్టర్స్ దగ్గర నుండి సర్టిఫికెట్ వచ్చేనెల 7వ తారీకు వరకుసమర్పించాలన్నారు
పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థుల
సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుల దగ్గర నుండి తీసుకొని ఈ నెల చివరి వరకు అందజేయాలన్నారు.
ఏ విద్యార్థి అయినా చదువు మధ్యలో ఆపేసి ఉన్నట్లయితే అటువంటి వారిని మండల విద్యాశాఖ అధికారులు గుర్తించి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు.
01 తరగతి నుండి 5, తరగతి
నుండి పదవ తరగతులలో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పదవ తరగతిలో చేరి వివిధ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న పిల్లలకు
ప్రత్యేక తరగతుల ద్వారా విద్యా బోధన అందించాలని తద్వారా సామర్ధ్యాలు మెరుగుపడతాయన్నారు. వీటికి సంబంధించి జూలై 4వ తారీఖు ఉదయం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు,మధ్యాహ్నం ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ కు విరిగా సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు
10వ తరగతిలోఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక బోధన ఏర్పాటు చేయాలన్నారు
ఈ కార్యక్రమంలోజిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,మండల విద్యాశాఖ అధికారులు మెదక్ నర్సాపూర్,కోఆర్డినేటర్లుసుదర్శన్ మూర్తి సతీష్ నవీన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.