చింతగింజల ఫ్యాక్టరీని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తావుర్య నాయక్
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో ఉన్న మహేష్ ఇండస్ట్రీస్ చింత గింజల ఫ్యాక్టరీలో ప్యూర్ ఆయిల్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తావుర్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫ్యాక్టరీని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింత గింజల ఫ్యాక్టరీలో ప్యూర్ ఆయిల్ ను పరిశీలించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ల్యాబ్ కు తీసుకెళుతున్నట్టు తెలిపారు. పరీక్షల అనంతరం తగు చర్యలు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా మెదక్ రోడ్ లో ఉన్న రుద్ర ఫ్యామిలీ దాబా హోటల్లో ఆయన పరిశీలించారు.అనంతరం రామాయంపేట పట్టణంలోని విజయ మిల్క్ డైరీ ను కూడా పరిశీలించారు.వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలకు ఏలాంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు ఆహారము శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలియపరచారు.